కామ్రేడ్.. కేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ సెనే్సషనల్ స్టార్‌గా ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం డియర్ కామ్రేడ్ సంచలనం రేపుతోంది. నిజానికి సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నప్పటికీ బిజినెస్‌కు సంబంధించిన డీల్స్ ఒక్కొక్కటిగా క్లోజవుతున్నాయి. టీజర్ విడుదల తరువాత అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. గీత గోవిందాన్ని మించిన ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో ట్రేడ్ భారీ పెట్టుబడులకు ఆసక్తిచూపిస్తోంది. మరోపక్క మైత్రి సంస్థ ఎక్కడికక్కడ రీజనబుల్ డీల్స్ అనిపించినవి ఆలస్యం చేయకుండా ఇచ్చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నైజామ్ సీడెడ్‌కు కలిపి ఓ భారీ మొత్తానికి చదలవాడ శ్రీనివాసరావు తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో నైజామ్ హక్కులను భారీ మొత్తానికి ఏషియన్ సునీల్‌కు ఇచ్చేశారని టాక్. మిగిలిన మొత్తంకంటే ఎక్కువ సీడెడ్‌నుంచి వస్తుంది కాబట్టి ఆయన విడుదలకు ముందే సేఫ్‌జోన్‌లోకి వెళ్లిపోయారు. మరోవైపు ఆంధ్రలోనూ భారీ డిమాండ్ ఉందట. ఇక ఓవర్సీస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇదంతా పక్కనపెడితే తమిళ, కన్నడ, మలయాళం ఏ భాషకు ఆ భాషలో విడిగా క్రేజ్ రావడంతో ‘డియర్ కామ్రేడ్’ నిజంగా కేక పుట్టించేలా ఉన్నాడు.