అమీర్ కొత్త గెటప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా క్రేజ్ తెచ్చుకున్న అమీర్‌ఖాన్ ఏ పాత్ర అంగీకరించినా, పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అందుకే అమీర్‌ఖాన్ ఏ ప్రాజెక్ట్‌కు సైన్ చేసినా అది వెంటనే క్రేజీ అవుతుంది. ఇక అమీర్‌ఖాన్ లుక్స్, గెటప్పుల విషయంలో చేసే ప్రయోగాలకు అంతే ఉండదు. తాజాగా అమీర్ ఒక కొత్త లుక్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. అమీర్‌ఖాన్ తన సోషల్ మీడియాద్వారా ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో సాధారణంగా ఉన్న అమీర్‌ను మేకప్ సాయంతో ఒక వయసుపైబడిన వ్యక్తిగా మార్చడం ఉంది. సగం బట్టతల, మిగతా సగం తెల్లటి జుట్టు, తెల్లమీసాలతో అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అమీర్. ఈ వీడియోకు ‘కమింగ్ సూన్... ఆప్ కే ఫోన్ పే’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అందరూ ఏమై ఉంటుందా? ఇది తన కొత్త సినిమా గెటప్పా? అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇంతకీ విషయమేంటంటే ‘ఫోన్ పే’ పేమెంట్స్ యాప్‌కు అమీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కుదిరాడు. ఈ బ్రాండ్ యాడ్ షూటింగ్‌కోసం ఇలా గెటప్ మార్చాడన్నమాట.