లవ్‌ మొదలెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్, శే్వతావర్మ జంటగా జి.కె.సినిమాస్ పతాకంపై నౌషాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ చెయ్యాలా వద్దా’. జి.వి.రమణ, సి.సంతోష్ నిర్మాతలు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రమణ మాట్లాడుతూ, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ నెల 15న 200 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, టెక్నికల్ విలువలతో కూడిన సినిమా ఇదని, ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి క్రేజ్ దక్కిందన్నారు. రొమాన్స్, లవ్ అంశాలతో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది అన్నారు. దర్శకుడు నౌషద్ మాట్లాడుతూ, కేవలం యూత్‌నే టార్గెట్ చేయకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా అన్ని అంశాలున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. కార్తీక్ మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది అన్నారు.