‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ఈసీ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. సినిమా విడుదలకు ఈసీ అంగీకరించిందని నిర్మాత రాకేశ్‌రెడ్డి వెల్లడించారు. ముందు ప్రకటించినట్టే ఈనెల 29న సినిమా విడుదల చేస్తున్నామన్నారు. కొన్ని సీన్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయన్న ఫిర్యాదుపై పరిశీలించేందుకు మీడియా సర్ట్ఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ముందు హాజరుకావాలని ఈసీ ఆదేశాల మేరకు నిర్మాత రాకేశ్‌రెడ్డి సోమవారం హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమాపై అన్ని అంశాలు వివరించటంతో ఎన్నికల సంఘం సంతృప్తి చెంది, సినిమా విడుదలకు అంగీకరించిందన్నారు. విడుదల తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందన్నారు. మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు చిత్రంలో లేవని, ఎన్టీఆర్ జీవితంలోని ఓ భాగానే్న సినిమాలో చూపించినట్టు ఎన్నికల సంఘానికి వివరించామన్నారు. లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగా సినిమా తీశామని, ఆనాడు జరిగిన సంఘటనలను మాత్రం సినిమాలో చూపించామని రాకేశ్‌రెడ్డి వివరించారు.