అచ్చంగా మహేష్‌లా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడమ్ టుసాడ్స్ రూపొందించిన మహేష్ వ్యాక్స్ స్టాట్యూని హైదరాబాద్‌లోని ఏఎంబీలో సోమవారం ఉదయం మహేష్‌బాబు విడుదల చేశారు. కార్యక్రమంలో మేడమ్ టుస్సాడ్స్ తరఫున అలెక్స్ పాల్గొన్నారు. సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ‘నా విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఇక్కడి సినీ ప్రియులమధ్య విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. గతేడాది వాళ్లు నన్ను సంప్రదించారు. రకరకాల కళ్లను, రంగు రంగుల జుట్టును తీసుకొచ్చి పోల్చిచూశారు. అదంతా మామూలుగా చేస్తున్నారని, కొలతలు తీసుకుంటున్నారని అనుకున్నా. కానీ వారు విగ్రహాన్ని మలిచినతీరు చాలాబావుంది. నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. నా బొమ్మకు ప్రాణం పోసిన ఇవాన్ రీజ్, బెంటానా టీమ్‌కు ధన్యవాదాలు. నాకు నా విగ్రహాన్ని చూస్తుంటే ఆనందంగా, అద్వితీయంగా గొప్ప ఉత్కంఠగా, ఒకింత భయంగా, అన్నీ భావాలు కలగలిపినట్టుంది. భారతదేశానికి చెందిన పలువురు సెలబ్రిటీల బొమ్మలు అక్కడున్నాయని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాలని కూడా అనుకుంటున్నా’ అన్నారు. మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిథి అలెక్స్ మాట్లాడుతూ ‘యునీక్ అకేషన్ ఇది. తొలిసారి మేం హైదరాబాద్‌కు వచ్చాం. తెలుగు సినిమాస్టార్ స్టాట్యూని సింగపూర్‌లో విడుదల చేయడం కూడా ఇదే తొలిసారి. మహేష్‌ని ఎంతోమంది రిఫర్ చేశారు. మా టీమ్ 20మంది ఆరునెలలు కష్టపడి స్టాట్యూని చేశారు. గతంలో షారుఖ్‌ఖాన్, అమితాబ్‌బచ్చన్, ఇప్పుడు మహేష్‌బాబు స్టాట్యూని విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. మహేష్ మైనపు విగ్రహాన్ని చూసిన నమ్రత స్పందిస్తూ ‘నాకు ఇద్దరు భరత్‌లను చూసినట్టుంది. రియల్‌గావున్న వ్యక్తి అందంగా ఉన్నాడు. స్టాట్యూలో ఉన్న వ్యక్తి ఆయనంత అందంగా ఉన్నాడు’ అని పేర్కొంది.