సూర్యకాంతం ట్రయాంగిల్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా రాహుల్ విజయ్ హీరోగా ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -సూర్యకాంతం మార్చి 29న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా తొలిసారి తెలుగు సినిమా చేస్తున్న సెకెండ్ హీరోయిన్ పెర్లెన్ బేసానియా తనను తాను పరిచయం చేసుకుంటూ మీడియాతో ముచ్చటించింది.
మాది బాంబే. నేను లా స్టూడెంట్‌ని. కానీ యాక్టింగ్ మీద ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాను. సూర్యకాంతం నా ఫస్ట్ ఫిల్మ్. కాకపోతే కొన్ని యాడ్స్‌లో, అలాగే ఫ్రెండ్స్‌కోసం ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్‌లో చేశా. అంతకుమించి కెమెరా ఎక్స్‌పీరియన్స్ లేదు. నేను మోడలింగ్ చేస్తుండగా, మేనేజర్ ద్వారా సూర్యకాంతం టీమ్‌ను కలిసాను. డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పారు. నచ్చింది. తరువాత ఆడిషన్స్ తీసుకున్నారు. వాళ్లనుకున్న పాత్రకు నేను సూటవుతానన్న నమ్మకంతో ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసేముందు రాహుల్‌కి నాకు ఫోటోషూట్ కూడా జరిగింది. సినిమాలో పూజ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. తానొక సెన్సిటివ్ గాళ్. ప్రతి చిన్న విషయానికీ పేరెంట్స్‌పై డిపెండవుతుంది. నిజజీవితంలో నా క్యారెక్టర్‌కి సినిమాలో క్యారెక్టర్‌కి చాలా వ్యత్యాసముంది. ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. కథలో భాగంగా మా పాత్రల మధ్య వచ్చే డ్రామాకి సంబంధించిన కథే తప్ప, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే కాదు. నేను చాలా నిజాయితీగా చెబుతున్నా. ఒక పర్సన్‌గా, యాక్టర్‌గా నిహారిక చాలా జన్యూన్. చాలా కోపరేట్ చేసింది. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అలాగే రాహుల్ కూడా బాగా ఎంకరేజ్ చేశాడు. తదుపరి సినిమాలు ఇంకా ఏ మూవీ ఒప్పుకోలేదు. కొన్ని ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. సూర్యకాంతం రిలీజ్ తరువాతే క్లారిటీ వస్తుంది.