ఎన్టీఆర్ లవ్‌స్టోరి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకాలం కమర్షియల్, మాస్ చిత్రాలతో అభిమానులను అలరించిన ఎన్టీఆర్ ఇప్పుడు తొలిసారిగా ఓ ప్రేమకథ ఇతివృత్తంగా తీయబోయే సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ షూటింగ్‌లో బిజీగా వున్న ఎన్టీఆర్ ఈ సినిమాను ఆగస్టుతో పూర్తిచేయనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. మరోవైపు పూరి జగన్నాధ్ కూడా లైన్లో వున్నాడు. ఇవి కాకుండా ఇప్పుడు లేటెస్టుగా మరో డైరెక్టర్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. ‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న హను రాఘవపుడి దర్శకత్వంలో ఈ సినిమా వుంటుందట. ఇప్పటికే కథ నచ్చడంతో ఓకె చెప్పాడట ఎన్టీఆర్. అయితే ఇందులో విశేషం ఉంది తెలుసా.. అదేమిటంటే, ఈ సినిమా పూర్తి లవ్‌స్టోరీతో ఉంటుందట. ఇప్పటివరకు మాస్ సినిమాలే చేసిన ఎన్టీఆర్ మొదటిసారి లవ్‌స్టోరీ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.