నాగకన్య పగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో క్రేజీభామలు వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరీన్, లక్ష్మీరాయ్ నటిస్తున్న తాజా చిత్రం -నాగకన్య. జర్నీ, రాజా రాణి చిత్రాల ఫేమ్ జై ఈ చిత్రంలో హీరో. జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ శ్రీ్ధర్ నిర్మాతగా ఎల్ సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. ఫస్ట్‌లుక్ పోస్టర్స్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. నాగకన్య బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ రొమాంటిక్ రెవేంజ్ పాయింట్, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ నాగకన్య లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. సినిమా మొదటిలుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ నుండి ఆడియో జ్యూక్ బాక్స్ వరకూ అన్ని ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి అన్నారు. విభిన్నమైన కానె్సప్టుతో తెరకెక్కిన సినిమాలో ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుందని, జై పాత్ర హైలెట్‌గా నిలుస్తుందన్నారు. ప్రతి పాత్రకూ మంచి పేరొచ్చేలా సినిమా ఉంటుందని, వేసవి కానుకగా ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు.