కేసీఆర్ బయోపిక్‌తో వర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగునాట బయోపిక్‌లకు పెద్దగా ఆదరణ దక్కకున్నా, కొంతమంది దర్శకులు ఇంకా ప్రముఖ వ్యక్తుల జీవితాలను బయోపిక్కులుగా తెరకెక్కించే ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెలంగాణ సీఎం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ బయోపిక్‌ను కూడా తరువాత చిత్రంగా తియ్యబోతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. అలాగే రామ్‌గోపాల్‌వర్మ ఈ బయోపిక్‌ను ఎప్పుడు మొదలుపెడతారో, ఇతర నటీనటులుగా ఎవర్ని తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం రామ్‌గోపాల్‌వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటు ఘట్టాన్ని ప్రధానాంశంగా తీసుకుని వర్మ తీసిన చిత్రం కొన్ని సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. చివరికి విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది.