చైతూని ప్రేమిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, సమంత, దివ్యాంన్షు కౌశిక్ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మజిలీ’. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మించారు. ఏప్రిల్ 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో దివ్యాంశ కౌశిక్ ముచ్చట్లు.
నేపథ్యం...
- మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నా. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత పోర్ట్ఫోలియో సిద్ధం చేసుకుని ఆడిషన్స్ చేస్తున్న టైంలో ‘మజిలీ’కి ఎంపికయ్యాను. తొలి చిత్రం సిద్ధార్థ్‌తో చేస్తున్నా. అది మే లేదా జూన్‌లో విడుదలయ్యే చాన్స్ ఉంది. తెలుగులో ‘మజిలీ’ నా తొలి సినిమా. ముంబైలో శిక్షణ టైంలో వర్క్‌షాప్స్‌కి హాజరయ్యా. ఫెయిర్ అండ్ లవ్‌లీ, పాన్‌టీన్, హీరోహోండా వంటి కమర్షియల్ యాడ్స్‌లో నటించా.
పాత్ర...
-నా పాత్ర పేరు అన్షు. చైతన్యను ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తా. ఇంతకంటే పాత్ర గురించి ఏం చెప్పలేను. చైతన్యతో వర్క్ చేయడం హ్యాపీ. డౌన్ టు ఎర్త్ పర్సన్. అమేజింగ్ కో స్టార్.
తెలుగులో...
-ప్రస్తుతానికి తెలుగు కొంచెంగా అర్థం చేసుకుంటున్నా. మాట్లాడలేను. తమిళంలో నటించడం తెలుగుతో పోల్చితే కొంచెం కష్టమే అనిపించింది. ఇక్కడ యూనిట్ సపోర్ట్ బావుంటుంది. నటిగా సమంత అంటే ఇష్టం. ఆమెతో కలిసి నటించలేదు.
దర్శకుడు శివ గురించి...
-డైరెక్టర్ శివ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛతోనే బాగా చేశాననిపిస్తోంది. డైరెక్టర్‌గా నన్ను గైడ్ చేయడమే కాదు, నాలో కాన్ఫిడెన్స్ పెంచారు.
గ్లామర్ పాత్రలు..
-నా పాత్ర తీరుతెన్నులు, పాత్ర గ్రాఫ్ నాకు నచ్చింది. అందుకే నటించా. కంటెంట్‌వున్న సినిమాలేకాదు.. గ్లామర్ పాత్రలు చేయడానికీ సిద్ధంగా ఉన్నా. దర్శకుడు సినిమాను అద్భుతంగా మలిచారు. చిన్న చిన్న సన్నివేశాలనూ బాగా మలిచారు. ప్రతిరోజూ మనం ఫేస్ చేసే విషయాలను చక్కగా ఎలివేట్ చేశారు.
ఇన్‌స్పిరేషన్...
-బాలీవుడ్‌లో ఆలియాభట్, కరీనాకపూర్, అనుష్కశర్మలను ఇష్టపడతాను. ఇక్కడ సమంత నటనంటే ఇష్టం. కొన్ని చిత్రాలు డిస్కషన్ దశలో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే చెబుతా.