సూర్యతో ఫ్రెండ్లీ చాలెంజ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నతో దర్శకుడు భరత్ కమ్మ తెరెకెక్కించిన చిత్రం -డియర్ కామ్రేడ్. తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ చిత్రం మే 31న విడుదలవుతోంది. ఓ పక్క విజయ్ హవా నడుస్తుండటం, విడుదలకు సమీపంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో -డియర్ కామ్రేడ్ దుమ్ము దులిపేయడం ఖాయం అనుకున్నారు. అయితే, ఎన్నికల కారణంగా విడుదల తేదీలు అటూఇటూ కావడంతో అదే రోజున తమిళస్టార్ సూర్య ‘ఎన్జీకే’ సైతం థియేటర్లకు వస్తోంది. ఎస్‌ఆర్ ప్రభు నిర్మాణంలో సూర్యతో పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాను దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించటం తెలిసిందే. ఈ చిత్రంలో సూర్యతో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి జోడీకట్టారు. నిజానికి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. అకస్మాత్తుగా వచ్చిన ఎన్నికల సీజన్ సినిమాపై ప్రభావం చూపించే పరిస్థితి ఉండటంతో, అందుకు అనుగుణంగా మే31న భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌గా వస్తున్న ఎన్జీకేకు యువన్ శంకర్ రాజా సంగీతం ఓ స్పెషల్ అట్రాక్షన్ అన్న ప్రచారం ఇప్పటికే భారీగా జరిగింది. సూర్యకు ఇటీవలి కాలంలో బ్లాక్‌బస్టర్ హిట్టు అందలేదు. దాంతో బ్లాక్‌బస్టర్ హిట్టుకోసం సూర్య ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్సే పెట్టాడు. మరోపక్క తమిళనాట సూర్యకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగని కుర్ర హీరో విజయ్ దేవరకొండను తీసిపారేయ లేం. యంగ్ హీరోల్లో విజయ్ మేనియా నడుస్తోంది. సో, రెండు చిత్రాలూ ఓకే రోజున థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో ఎవరు ఎవరికి గట్టి పోటీ అవుతారన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది. సూర్య, రకుల్, సాయిపల్లవి ప్యాకేజీతో భారీ సినిమాగా వస్తున్న ‘ఎన్జీకే’.. యంగ్ జనరేషన్‌పై బలమైన ముద్రవేసిన విజయ్, రష్మికల అట్రాక్షన్‌తో వస్తున్న ‘డియర్ కామ్రేడ్’.. ఎవరు ఎలాంటి ప్రభావం చూపిస్తారో వెండితెరపైనే చూడాలి.