నైజాం సర్కరోడ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ్ జాదవ్, జ్యోతి సుభాష్, శరత్ బుటాడియా, శశాంక్ షిండే, జాకీర్ హుస్సేన్ కీలక పాత్రల్లో నటించిన మరాఠి చిత్రం ‘నైజాం సర్కరోడ’. నైజాం, తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో వౌళి ఫిలింస్ పతాకంపై రాజవౌళి అందిస్తున్నారు. రాజ్ దుర్గే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తెలంగాణా సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజవౌళి మాట్లాడుతూ, హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్న మహారాష్టల్రో స్థిరపడ్డ ఒక యోధుడి తనయుడు దర్శకుడని, 1948 సెప్టెంబర్ 17కన్నా ముందు రజాకార్ల రాక్షస రాజ్యంలో జరిగిన అకృత్యాలు, దురాగతాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ సినిమా రూపొందిందని తెలిపారు. సామాన్య మానవుడు పోరాటం చారిత్రాత్మక విముక్తి ఏ విధంగా జరిగింది, అప్పటి స్థితిగతులు, సంస్కృతి, భాష, పోరాటాల తీరు దర్శకుడు చక్కగా చిత్రీకరించారని తెలిపారు. తెలుగువాళ్లు తీయాల్సిన ఈ చిత్రాన్ని మరాఠిలో రూపొందించడంతో ఆ హక్కులు తీసుకున్నామని, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.