తగ్గిన కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేపకళ్ల చిన్నది కాజల్ అగర్వాల్ కెరీర్ రోజురోజుకీ తగ్గిపోతోంది అనడానికి ఈ ఉదాహరణ చాలంటూ టాలీవుడ్ సినీ పండితులు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని చూపిస్తున్నారు. ఈ చిత్రంలో యువరాణిగా నటించిన కాజల్, అటు ప్రతిభపరంగా, ఇటు గ్లామర్ పరంగా ఎటువంటి మెరుపులు మెరిపించలేకపోయిందని అంటున్నారు. మగధీరలో అద్భుతమైన నటనను కనబర్చిన ఆమె ఈ చిత్రానికి వచ్చేసరికి కుదేలైంది అంటున్నారు. హీరోయిన్ అన్న తరువాత ముఖంలో మెరుపులేకపోతే చూసేవారికి నచ్చదు. ప్రస్తుతం కాజల్ ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె కెరీర్‌లో మంచి సినిమాలు వున్నా ఆ రెండు సినిమాల ప్లస్‌లు ఏమైనా వుంటే ఆమె ఖాతాలో పడే అవకాశం లేదు. దీన్ని బట్టి కాజల్ అందం రోజురోజుకూ తగ్గుతోందని నిరూపించేస్తున్నారు. ఇప్పటికైనా జాగ్రత్తపడకపోతే కష్టమే!