తెలుగులో కేడి - కిలాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన ‘కేడి బిల్లా-కిలాడి రంగా’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విమల్, శివకార్తికేయన్, రెజీనా, బిందుమాధవి ప్రధాన తారాగణంగా నటించారు. అనువాద కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో ఆడియోను విడుదల చేసుకోనుంది. చిత్ర సమర్పకులు రాజ్‌కందుకూరి మాట్లాడుతూ, తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా విజయం సాధిస్తుందన్నారు. భీమవరం టాకీస్ పతాకంపై చిత్రాన్ని అందిస్తున్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, బిందుమాధవి గ్లామర్, విమల్, కార్తికేయన్‌ల నటన, పాండిరాజ్ దర్శకత్వ ప్రతిభ, యువన్ శంకర్‌రాజా సంగీతం చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని, త్వరలో ఆడియో విడుదల చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికుమార్, ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, సంగీతం: యువన్ శంకర్‌రాజా, సమర్పణ: రాజ్ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండిరాజ్.