మహిళల సమస్యలకు అద్దంపట్టే ఓ మల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయమై, ఎనిమిది భాషల్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది నటి రమ్యశ్రీ. ఆమె తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ మల్లి’. రఘుబాబు, ఆకాష్, ఎల్బీశ్రీరామ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతున్న సందర్భంగా నటి, దర్శకురాలు, నిర్మాత రమ్యశ్రీ చెప్పిన విశేషాలు..ఆమె మాటల్లోనే..
‘గ్లామర్ పరిశ్రమపై ఆశ ఉన్న చాలామంది అమ్మాయిల జీవితాలు ఏవౌతున్నాయి? నేను పదో తరగతి చదువుతున్నప్పుడు ఓ సంఘటన చూశాను. అది నా మైండ్‌లో అలా వుండిపోయింది. ఆ తర్వాత నేను పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అదే పరిస్థితిని కథగా మలిచి సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కథను బాగా నమ్మాను కాబట్టి ప్యాషన్‌తో ఈ సినిమా చేశాను. ప్రస్తుతం ఆడవాళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ఓ మహిళ కథే ఈ సినిమా. ఈ సినిమాకోసం దర్శకత్వం కూడా నేనే చేశాను. ఆ విషయంలో బాగా టెన్షన్ పడ్డాను. కథ నాది కాబట్టి దర్శకత్వం చేస్తే బావుంటుందనే ఆలోచనతో దిగాను.
ఈ సినిమాను నేనే నిర్మించాను. ఈ సినిమా కథ తెలిసి నాకు బాగా పరిచయం వున్నవాళ్లు ఇలాంటి కథతో ఎవరూ సినిమా చేయలేదని, ఇలాంటి పాత్ర ఎవరూ చేయలేరని అభినందిస్తున్నారు. నటనకు బాగా స్కోప్ వున్న సినిమా ఇది. ఇన్ని సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి నటన మరెవరూ చేసి వుండరని అంటున్నారు. చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకు సునీల్ కాశ్యప్ సంగీతం అందించారు. పాటలు బాగా వచ్చాయి. ఇక ఈ సినిమా కొన్ని అనుకోని కారణాలవల్ల ఆలస్యమైంది. అలాగే థియేటర్స్ ప్రాబ్లమ్‌వల్ల కూడా ఆలస్యం అయిందని చెప్పాలి. ఈ సినిమా ఒక గిరిజన యువతి చుట్టూ నడిచే కథతో ఉంటుంది. అక్కడి సంఘటనల్ని రియల్‌గా చూపించాం. ఇది సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలున్న సినిమా. ఈ చిత్రాన్ని ఈనెల 15న వందకు పైగా థియేటర్లలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.