ఢీ సీక్వెల్ రానుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు శ్రీనుకు వరుసగా భారీ పరాజయాలు రావడంతో వెనుకబడిపోయాడు. దాంతో తాజాగా తనకు సక్సెస్ తెచ్చిపెట్టిన ఢీ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు శ్రీనువైట్ల. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఆ సినిమాలో విలన్‌ను బఫూన్‌ను చేసి హీరో ఆడుకోవడం అన్న ఫార్ములతో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ఫార్ములా జనాలకు బాగా నచ్చింది. అదే ఫార్ములాతో రెడీ, కింగ్ లాంటి సినిమాలు తీసి హిట్ కొట్టాడు శ్రీనువైట్ల. ఆ తరువాత శ్రీనువైట్ల చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా రవితేజతో తీసిన అమర్ అక్బర్ ఆంథోని భారీ పరాజయంతో ఆయన పని అయిపోయిందని అంటున్నారు. మళ్లీ తన స్టామినాను ప్రూవ్ చేసుకునేందుకు ఇప్పుడు ఢీ ఫార్ములాతో సినిమాకు రెడీ అయ్యాడు. మంచు విష్ణు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుందట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్టు టాక్.