సిద్ధమవుతున్న బైలంపుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తార క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త బ్రహ్మానందరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘బైలంపుడి’. హరీష్ వినయ్, తనిష్క తివారి జంటగా నటిస్తోన్న చిత్రం ద్వారా అనిల్ పిజి రాజ్ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నెలాఖరులో ఆడియో విడుదల, మేలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సినిమామీద ఆసక్తితో తొలిసారిగా నిర్మాతగా ‘బైలంపుడి’ నిర్మిస్తున్నా. అంతా కొత్తవారైనప్పటికీ ఎంతో సహజసిద్ధంగా నటించారు. హైటెక్నికల్ వాల్యూస్‌తో సినిమాని తెరకెక్కించాము. ‘ఇక్కడ యుద్ధంచేయాలి... గెలవడానికి కాదు, బతకడానికి’ అనేది క్యాప్షన్. ఏప్రిల్ ఎండింగ్‌లో ఆడియో విడుదల చేసి మేలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు అనిల్ పిజి రాజ్ మాట్లాడుతూ ‘బైలంపుడి’ గ్రామంలో జరిగే లవ్ అండ్ పొలిటికల్ చిత్రమిది. ప్రతి పాత్ర ఎంతో సహజసిద్ధంగా ఉంటుంది. ఒక విలేజ్‌లో ఏమైతే అంశాలు ఉంటాయో మా సినిమాలో కూడా అన్ని అంశాలుంటాయి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రస్తుతం కొత్త కథలను ఆదరిస్తున్నారు. ఆ తరహాలో వచ్చే మా సినిమానూ ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. హరీష్ వినయ్, తనిష్క తివారి, బ్రహ్మానందరెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్, నటరాజ్, నరి, నాగార్జున, సెబాస్టియన్ తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం సుభాష్ ఆనంద్ సమకూరుస్తున్నారు.