అలగమాకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు రష్మిక బర్త్‌డే సందర్భంగా చిత్రంనుంచి ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రష్మి లిల్లీ పాత్రలో క్రికెటర్‌గా కనిపించనుంది. చిత్రంలోని మొదటి పాటను 8న విడుదల చేసి రష్మికకు అంకితమివ్వనున్నట్టు విజయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఆ మెసేజ్‌లో అలగమాకే అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్య జోడించాడు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయ. మే 31న ఈ సినిమా సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల కానుంది. ఏప్రిల్ 8న ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్టు ఇంతకుముందు విజయ్ ఫ్యాన్స్‌కు చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఆ సర్‌ప్రైజ్ ఆడియన్స్‌కు చెప్పొద్దుగానీ, తనకు చెప్పమంటూ రష్మిక అడిగింది. ఆమెకూ చెప్పకపోవడంతో అలిగి ఉంటుందన్నట్టు విజయ్ ఆ వ్యాఖ్యను సరదాగా జోడించాడని తెలుస్తోంది.