పండగ పోస్టర్ పడింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సంవత్సరాది మొదలైంది. సెంటిమెంట్ హిట్టుపై ఆశతో అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. పండుగ పురస్కరించుకుని ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెబుతూనే, పనిలో పనిగా ఆయా సినిమాల పోస్టర్లను విడుదల చేశారు. ఆది హీరోగా, కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం -జోడీ. సాయి వెంకటేశ్, పద్మజలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి విశ్వనాథ్ దర్శకుడు. పండుగ సందర్భంగా జోడీ టైటిల్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఏబీసీడీ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. మే 17న విడుదలవుతున్న చిత్రానికి సంబంధించి ఉగాది రోజున పోస్టర్‌ను విడుదల చేశారు. మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్‌పై దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. రాక్షసన్‌కు రీమేక్‌గా వస్తున్న ‘రాక్షసుడు’ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లు. వీళ్లిద్దరితోపాటు ఓ చిన్నారి హంతకుడిని ఫోకస్ చేస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రానికి రమేష్ వర్మన్ తెరకెక్కిస్తున్నాడు. అలాగే సాయిశ్రీనివాస్, కాజల్ మరోసారి జోడీగా నటిస్తున్న మరో చిత్రం ‘సీత’. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రంగా తెరకెక్కుతున్న సినిమాకు దర్శకుడు తేజ. ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా సీత పోస్టర్‌ను విడుదల చేశారు. ఆర్‌ఎక్స్ 100 అందించిన విజయోత్సాహంతో హీరో కార్తికేయ చేస్తున్న తదుపరి చిత్రం హిప్పీ. దగంగన కథానాయిక. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని టిఎన్ కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. సప్తగిరి హీరోగా రూపొందుతున్న చిత్రం -వజ్ర కవచధర గోవింద. చిత్రమైన వేషంలో హీరోతో పోస్టర్ విడుదల చేయడమే కాదు, ఏప్రిల్ చివరి వారంలో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటన కూడా విడుదల చేశారు. అరుణ్ పవర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ముని సిరీస్‌లో భాగంగా రాఘవ లారెన్స్ ప్రతిష్టాత్మకంగా తెస్తున్న సీక్వెల్ సినిమా కాంచన-3. అటు దర్శకత్వం, ఇటు నిర్మాణ బాధ్యతల్ని చూస్తున్న లారెన్స్ పోస్టర్‌ను విడుదల చేయడమే కాదు, ‘స్నేహితుడికి కోవెల కట్టు’ పాటను విడుదల చేశాడు. ఇక ఊరంతా అనుకుంటున్నారు, దీర్ఘాయుష్మాన్‌భవ, కృష్ణారావు సూపర్ మార్కెట్ సినిమాల పోస్టర్లను సైతం ఆయా చిత్రబృందాలు ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేశాయి. మొత్తానికి కొత్త సంవత్సరాదిన సినిమాల హడావుడి కనిపించింది.