మొదలైన ‘చిత్రసేన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఆర్‌ఎస్ అసోసియేట్స్, మీటీవీ సమర్పిస్తున్న చిత్రం చిత్రసేన. నర్సింహరాజు రాచూరి, అజయ్‌మైసూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దిలీప్‌కుమార్ సల్వాది దర్శకుడు. ఉగాది సందర్భంగా రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. అజయ్ మైసూర్, నర్సింహరాజు కలిసి కెమెరా స్విచాన్ చేయగా లగడపాటి శ్రీ్ధర్ క్లాప్ కొట్టారు. అనంతరం లగడపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ ఈ చిత్రం ఎక్కువగా విఎఫ్‌ఎక్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చేదని, పీరియాడిక్ చిత్రాలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో పీరియాడిక్ చిత్రంగా వస్తుందన్నారు. అంతకుముందు దిక్సూచి చిత్రం తీసిన దర్శకుడు దిలీప్ సల్వాది దీంట్లో హీరోగా నటించి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. నిర్మాత అజయ్ మాట్లాడుతూ తాను ఆస్ట్రేలియా నుంచి వచ్చానని, దిలీప్ నటించిన దిక్సూచి నచ్చడంతో, ఆయన చెప్పిన కథ నచ్చి నిర్మాణానికి అంగీకరించానన్నారు. ప్రొడ్యూసర్ నర్సింహరాజు మాట్లాడుతూ దీనికిముందు తాను దిక్సూచి నిర్మించానని, ఆ సినిమా డైరెక్టర్ దిలీప్‌కుమార్ సల్వాది ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారన్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథను నమ్మి చిత్రం చేస్తున్నట్టు చెప్పారు. హీరో దిలీప్‌కుమార్ సల్వాది మాట్లాడుతూ సినిమాలో చిత్రసేన ఎవరన్నది ప్రధానమైన సస్పెన్స్‌గా నడుస్తుందన్నారు. సెకండాఫ్ మొత్తం పీరియాడిక్‌లో ఉంటుందని, ఒక ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయన్నారు.