అలా.. సెట్ చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిగా ఆసక్తిగా అనిపిస్తే చాలు -చారిత్రాత్మక చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకుడు నెత్తిన పెట్టుకుంటాడు. బాలీవుడ్‌లో ఆ తరహా సినిమాల నిర్మాణం తక్కువేం కాదు. ఆ కోవలో తెరకెక్కుతున్న మరో భారీ చారిత్రక చిత్రం -కళంక్. అభిషేక్ వర్మన్ దర్శకుడు.
బాలీవుడ్ స్టార్స్ సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, వరుణ్‌ధావన్, అలియాభట్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో సెట్స్ అందాలు కళ్లను కట్టిపడేయడమే కాదు, సినిమాపై అంచనాలు పెంచేశాయి. కళంక్ సెట్స్ వెనుక కష్టాన్ని చిత్ర బృందం ఓ వీడియో రూపంలో విడుదల చేసింది. వీడియోలో వరుణ్ సెట్‌కు సంబంధించిన అంశాలను వివరిస్తున్నాడు. హుస్నాబాద్‌లో 1945నాటి కాలాన్ని తలపిస్తూ ఏకంగా టౌన్‌షిడప్‌నే రూపొందించారు. మూడు నెలలపాటు సాగిన ఈ సెట్ ఆవిష్కరణలో 700మంది వర్కర్లు పాల్గొన్నారట. స్వాతంత్య్రానికి ముందు ఓ యువరాణితో సాధారణ వ్యక్తి సాగించిన ప్రేమకథ ఇతివృత్తంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. యువరాణి రూప్ పాత్రలో ఆలియా కనిపించనుంది. ఏప్రిల్ 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు వస్తోంది.