ఆర్జీవీ.. ఇంటిలిజెన్స్ ఆఫీసర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి విషయాన్నీ సెనే్సషన్ చేయడం వర్మకు సెనే్సషన్‌తో పెట్టిన విద్య. అతనికి సంబంధించిన మామూలు విషయాన్నీ సెనే్సషన్ కోణంలో చూడటం జనానికీ సెనే్సషన్‌తో కూడిన ఇష్టం. ఆ బ్యాచ్‌లోకి బిగ్ బీ అమితాబ్ కూడా చేరిపోయాడు. కథకుడు, దర్శకుడు, నిర్మాత, సమర్పకుడు.. ఇలా భిన్నమైన కోణాలను ఆవిష్కరించిన వర్మ -త్వరలోనే స్క్రీన్‌మీదా ఓ ఐవోను ఆవిష్కరించబోతున్నాడు. తాను నటిస్తున్నానంటూ వర్మ చేసిన ట్వీట్‌పై బిగి బీ స్పందిస్తూ ‘వీడెవడండీ బాబూ.. నాకు పోటీ’ అన్నట్టు సరదాగా కామెంట్ పెట్టాడు. తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ పెడుతూ ‘చివరికి వర్మ.. నా ‘సర్కార్’ తన అసలైన రూట్‌కి వచ్చాడు. ఆర్టిస్ట్.. ఆల్ ది బెస్ట్. డామ్.. నాకింకో పోటీ’ అంటూ అమితాబ్ పెట్టిన ఫన్నీ ట్వీట్ వైరలవుతోంది. కోబ్రా చిత్రంలో తాను నటిస్తున్నట్టు వర్మ ప్రకటించటం తెలిసిందే. అంతేకాదు, అదీ ఓ నేరస్థుడి బయోపిక్ అంటూ మరో బాంబు పేల్చాడు. భారత నేర చరిత్రలోనే ఎప్పుడూ గుర్తించని అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడి బయోపిక్ అంటూ సెనే్సషన్ చేయడం మొదలెట్టాడు. ‘శత్రువుని చంపడానికి తాచును చేరదీస్తే, ఏదోకరోజు అదే కాటేస్తోంది’ అన్న క్యాప్షన్‌తో విడుదల పోస్టర్ సైతం ఆర్జీవీ స్టయిల్లోనే ఉంది.
ఓ చేతిలో గన్, మరో చేతిలో సిగరెట్‌తో కనిపిస్తున్న వర్మ -సినిమాలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నాడట. కొత్త నటుడు కేజీ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.