రుణం తీర్చుకునేదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరు స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా దర్శకుడు ఎస్ గుండ్రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం -రుణం. బెస్ట్‌విన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భీమినేని సురేష్, జి రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపికృష్ణ, మహేంద్ర శిల్పా, ప్రియా అగస్థ్యన్ నటీనటులు. సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆడియో సక్సెస్ మీట్‌లో నిర్మాత రామకృష్ణారావు మాట్లాడుతూ ‘ప్రతి ఇంట్లోవుండే రుణానుబంధాలు, మానవ సంబంధాలు ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఇద్దరు స్నేహితుల కుటుంబాల మధ్య నడిచే కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా కోసం పనిచేసిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల సహకారానికి కృతజ్ఞతలు’ అన్నారు. నిర్మాత భీమినేని మాట్లాడుతూ ‘యూనిట్‌కి రుణపడి ఉన్నా. వచ్చె నెలలో మరో సినిమా మొదలుపెడుతున్నాం. కష్టపడి పనిచేసిన ఈ యూనిట్‌కు మళ్లీ అవకాశం ఇస్తా’ అన్నారు. దర్శకుడు గుండ్రెడ్డి మాట్లాడుతూ కన్నడలో ఐదు చిత్రాలు, తెలుగులో ఎన్నో సీరియళ్లకు పనిచేసిన అనుభవంతో దర్శకుడిగా మారానన్నారు. అశ్లీలత అనేది లేకుండా చిత్రం నిర్మించామని, సందేశం ఇచ్చే ఉద్దేశంతో సినిమా చేయకున్నా.. ఇళ్లలోని చిన్న చిన్న అపార్థాలు తొలగించే ఉద్దేశంగా సినిమా సాగుతుందన్నారు. కార్యక్రమంలో హీరో హీరోయిన్లు, సంగీత దర్శకుడు, ప్రతి నాయకుడు మాట్లాడుతూ చిన్న సినిమాను పెద్ద మనసుతో ఆదరించాలని కోరారు.