కలిసొచ్చే పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుడవేగతో రీఎంట్రీ ఫస్ట్ హిట్టందుకున్న సీనియర్ సీరో రాజశేఖర్, కొత్త కథ కోసం చాలాకాలమే ఎదురు చూశాడు. చివరకు దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చడంతో -కల్కి టైటిల్‌తో సెట్స్‌పైకి వెళ్లారు. ఈ సినిమాలోనూ రాజశేఖర్ కలిసొచ్చే పోలీస్ పాత్రనే పోషిస్తున్నాడు. పోలీస్ స్టోరీస్‌తో హీరోగా క్రేజ్ పెంచుకున్న రాజశేఖర్, ఈ సినిమాకూ అదే పాత్ర కలిసొస్తుందన్న ఆశల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆదాశర్మ కథానాయికగా కనిపించనుంది. దాదాపు కల్కి చిత్రీకరణ పూరె్తైన నేపథ్యంలో, త్వరలోనే టీజర్ విడుదలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్టు ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నేటి ఉదయం 10 గంటల 10 నిమిషాల 10 సెకన్లకు టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దశావతారాల్లో కల్కిది 10వ అవతారం కావడంతో ముహూర్తాన్ని అలా సెట్ చేసినట్టు చెబుతున్నారు. గరుడవేగతో మంచి విజయాన్ని అందుకున్న రాజశేఖర్‌కు ‘కల్కి’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.