ఆలియా తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలియా తెలుగు ప్రాక్టీస్ చేస్తోందట. ఎందుకూ? అంటే -రాజవౌళి ట్రిపుర్ ఆర్ చిత్రం కోసమని అంటోందట. బాలీవుడ్ స్క్రీన్ మీద టాప్‌గేర్ క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న ఆలియా -రాజవౌళి ట్రిపుల్ ఆర్ సినిమాకు ఓకే చెప్పి సంచలనం రేపింది. జక్కన్న స్టామినాను ‘బాహుబలి’తో రుచి చూసిన కారణంగానే ఆమె ఓకే చెప్పినట్టు కథనాలూ వెలువడ్డాయి. ఈ సినిమాలో చరణ్‌తో ఆమె జోడీ కట్టనుంది. ప్రాజెక్టులోకి చేరే టైం దగ్గరపడటంతో -తెలుగు భాషను ఆలియా ప్రాక్టీస్ చేస్తోందని అంటున్నారు. భాష అర్థమైతే భావాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయగలమని నమ్మే ఆలియా -తెలుగు సినిమా కోసం ట్యూటర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఓ పాత్ర కోసం ఆర్టిస్టుగా ఆమె పడే తపనే ఆమెను టాప్ రేంజ్‌కి తీసుకెళ్లిందని అనుకోవచ్చు.