తెలుగులో గుల్లు దాదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదీ సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గుల్లు దాదా (అద్నాన్ షాజిద్‌ఖాన్) తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజేష్ పుత్ర దర్శకత్వంలో డిక్కీ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ, హైదరాబాదీ సినిమాల్లో గుల్లు దాదా నటిస్తే ఆ సినిమాకు చాలా క్రేజ్ వుంటుందని, ఆయన్ను తొలిసారిగా తెలుగు చిత్రంతో పరిచయం చేస్తున్నామని, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. గుల్లుదాదా మాట్లాడుతూ, తెలుగులో ఎంట్రీ అవ్వడం ఆనందంగా వుందని, ఈ అవకాశమిచ్చిన రాజేష్‌కు ధన్యవాదాలన్నారు.