ముహూర్తం కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’ చిత్రాల పరాజయంతో కాస్త వెనుకబడిన శ్రీను వైట్ల మళ్లీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుకానున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న ప్రారంభించడానికి సిద్ధమయ్యారట. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ’కంచె’, ‘లోఫర్’ చిత్రాలతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌తేజ్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే హీరోయిన్ ఎవరనేది వెల్లడిస్తారని తెలిసింది.