నాయకి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ హీరోయిన్ త్రిష టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై గిరిధర్ మామిడిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులో త్రిష పాడిన పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ, త్రిష పాడిన పాటకు మంచి స్పందన వస్తోందన్నారు. రెగ్యులర్ గాయనిగా ఎంతో అద్భుతంగా పాట పాడిందని, ఈనెల 19న హైదరాబాద్‌లో మిగతా పాటలను విడుదల చేయనున్నామని, ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని, మేలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. దర్శకుడు గోవి మాట్లాడుతూ, హారర్ జోనర్ చిత్రాల్లో కొత్తరకమైన సినిమా ఇదని, త్రిష తన కెరీర్‌లోనే అద్భుతమైన నటనను ప్రదర్శించిందని, ఇందులో ఆమె పాత్రకు భిన్నమైన కోణాలు వుంటాయని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:జగదీష్ చీకటి, సంగీతం:రఘు కుంచె, పాటలు:్భస్కరభట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:రాంబాబు కుంపట్ల, సమర్పణ:రాజ్ కందుకూరి, ఎడిటింగ్:గౌతంరాజు, నిర్మాతలు:గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి, దర్శకత్వం:గోవి.