మహాకవి ఆశయాన్ని చేతల్లో చూపే శ్రీశ్రీ --- హీరో కృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు కృష్ణ, విజయనిర్మల, నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వంలో ఎస్.బి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై సాయిదీప్, బాలూరెడ్డి, షేక్ సిరాజ్‌లు నిర్మిస్తున్న చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుపుకుంటున్న సందర్భంగా బుధవారం లొకేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కృష్ణ మాట్లాడుతూ, శ్రీశ్రీ అనే టైటిల్ వింటుంటే మహాకవి శ్రీశ్రీగారు గుర్తొస్తున్నారు. ఆ మహాకవి తన ఆవేశాన్ని రాతల్లో చూపిస్తే, ఈ శ్రీశ్రీ ఆ ఆవేశాన్ని చేతల్లో చూపిస్తాడని, ఈ సినిమాలో నటిస్తున్నందుకు ఆనందంగా వుందని, ముప్పలనేని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని అన్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిందని అన్నారు. విజయనిర్మల మాట్లాడుతూ, కథతోపాటు పాత్రలు కూడా బాగా నచ్చడంతో కృష్ణ, నేను కలిసి నటిస్తున్నామన, తామిద్దరం కలిసి నటిస్తున్న 43వ సినిమా ఇదని, ఏడు సంవత్సరాల వయసులో బాలనటిగా సినిమాల్లోకి వచ్చానని, మళ్లీ 70 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇస్తున్నానని, ఇకపై మంచి పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నరేష్ మాట్లాడుతూ, తెలుగు సినిమాకు, భారతీయ సినిమాకు గొప్ప ఘనత తెచ్చిపెట్టిన వ్యక్తి కృష్ణ అని, ప్రతి దశాబ్దంలో ఆయనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారని, ఈ సినిమా సామాజిక స్పృహ స్ఫూర్తితో వుంటుందని అన్నారు.
మరాఠీలో సూపర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో శివ రూపొందిస్తున్నారని, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమిదని, ఇందులో నేను కీ రోల్ పోషిస్తున్నానన్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ, 1994లో ‘ఘరానా అల్లుడు’ సినిమా ద్వారా నన్ను దర్శకునిగా మార్చిన కృష్ణ అంటే చాలా ఇష్టమని, మళ్లీ ఆయనతో చేస్తున్న సినిమా ఇదన్నారు. శ్రీశ్రీ భావజాలం నేటి సగటు మనిషిలో పుడితే ఎలా వుంటుందో అదే ఈ సినిమా, అని, 25 శాతం షూటింగ్ మిగిలి వుందని, త్వరలోనే దాన్ని పూర్తిచేసి ఫిబ్రవరి 12న చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.