వాల్మీకి మొదలెట్టాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎఫ్ 2’లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌తీసుకున్న వరుణ్ తాజాగా తన కొత్త సినిమా షూటింగ్‌లో జాయిన్‌అయ్యాడు. మాస్ చిత్రాలు తెరకెక్కించడంలో స్పెషలిస్టుఅయిన హరీష్ శంకర్ ‘వాల్మీకి’అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ ‘జిగార్తండ’కు రీమేక్ అయిన ఈ సినిమాలో వరుణ్ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తాడు. తమిళ హీరో అధర్వ మురళి ఈ సినిమాలో మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. తమిళంలో బాబీ సింహా నటించిన పాత్రలో వరుణ్ తేజ్.. సిద్ధార్థ్ నటించిన పాత్రలో అధర్వ నటిస్తారు. తమిళ భాష మృణాళిని రవి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో ఈరోజే వరుణ్‌తేజ్ జాయిన్ అయ్యాడు. ఈ విషయం తెలుపుతూ ‘వాల్మీకి మొదటిరోజు షూటింగ్, ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నా’అంటూ వరుణ్‌తేజ్ తన ట్విట్టర్ ఖాతాద్వారా ట్వీట్ చేశాడు. హైదరాబాద్...పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ 35 రోజులపాటు జరగనుందని సమాచారం. గ్యాంగ్‌స్టర్ కామెడీ అయిన ఈ సినిమా కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దర్శకుడు హరీష్ శంకర్ మార్పుచేర్పులు చేశాడట. హరీష్‌శంకర్ కెరీర్లో రీమేక్ సినిమాగా తెరకెక్కిన ‘గబ్బర్‌సింగ్’ పవన్‌కల్యాణ్‌కు ఎంత పెద్దహిట్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్టుగా రీమేక్‌ను మలిచినందుకు అప్పట్లో హరీష్ ప్రశంసలు అందుకున్నాడు. మరి ఇప్పుడు ‘జిగార్తాండ’ రీమేక్‌తో అలాంటి ఫీట్ రిపీట్ చేస్తాడేమో వేచి చూడాలి.