రకుల్.. జోరు తగ్గడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాదిన అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది రకుల్‌ప్రీత్‌సింగ్. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్లలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా అటు కుర్రహీరోలు, ఇటు స్టార్ హీరోలతో జోడీ కట్టి సత్తా చాటుకుంది. గ్లామర్, నటన రెండూ పుష్కలంగావున్నా కొత్త అందాల రాకతో ఈ బ్యూటీకి చాన్స్‌లు తగ్గాయ. ఇక ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్‌లో గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది రకుల్. ఇదివరకే బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేసినా రకుల్‌కు అక్కడా కెరీర్ ఊపందుకోలేదు. దీంతో రెట్టించిన కసితో ప్రయత్నాలు చేస్తోందట రకుల్. తాజాగా అజయ్ దేవగణ్‌తో కలిసి చేస్తున్న దే దే ప్యార్ దే సినిమా కోసం గ్లామర్ సూత్రాన్నీ అప్లై చేసిందట. టీజర్‌లో రకుల్ అందాలు చూసిన కుర్రాళ్లంతా.. ఇంత హీట్ పెంచిందా అంటూ షాకవుతున్నారు. ఓ పాటలో అయితే రకుల్ అందాలు షాకిస్తున్నాయి. ఈ దెబ్బతో అమ్మడు బాలీవుడ్‌లో సెటిలవ్వడం ఖాయమంటూ బి టౌన్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ కోసం మరింత సన్నబడిన రకుల్ జీరో సైజ్‌లో అదరగొడుతుంది. వరుస చూస్తుంటే రకుల్ బాలీవుడ్‌లో తిష్టవేయడం ఖాయం.