స్వాతి వచ్చేసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినూత్న పాయింట్‌తో రూపొందించిన ‘కార్తికేయ’ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు చందు మొండేటి. ఇక చందు మొండేటి చివరిగా చేసిన ‘సవ్యసాచి’ సినిమా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చినా బాక్సాఫీస్‌వద్ద అపజయాన్ని మూటకట్టుకుంది. దాంతో చందు మొండేటి నాగార్జునతో చేయాల్సిన ప్రాజెక్ట్ వెనక్కిపోవడం తెలిసిందే. అలాగే ‘శర్వానంద్’తోనూ ఓ ప్రాజెక్టు చేతుల్లోకి వచ్చి చేజారిపోయింది. దాంతో చందు తనకు లైఫిచ్చిన కార్తికేయపైనే మళ్లీ దృష్టిపెట్టాడు. తాజా ప్రాజెక్టుగా నిఖిల్‌తో ‘కార్తికేయ-2’ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా కార్తికేయలో హీరోయిన్‌గా నటించిన కలర్స్ స్వాతి, ‘కార్తికేయ-2’లోనూ నటించబోతున్నట్టు సమాచారం. పెళ్లి తరువాత స్క్రీన్‌కు ఒకింత దూరంగావున్న స్వాతి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతోందన్న మాట. అలాగే కలర్స్ స్వాతితోపాటు కార్తికేయ-2లో మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి కలర్స్ స్వాతి రీ ఎంట్రీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.