ఇద్దరూ.. మళ్లీ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఏడాది బాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ‘అందాదున్’ సౌత్ రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. క్రైమ్‌థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం దీన్ని తెలుగు తమిళ్‌లో సిద్ధార్థ్ హీరోగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీనిపట్ల తాను ఆసక్తిగా ఉన్నానంటూ సిద్ధార్థ్ కొద్దిరోజుల క్రితమే ప్రకటించాడు. అతనికి జోడీగా త్రిష నటించే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. హిందీ వర్షన్‌లో రాధికా ఆప్టే చేసిన పాత్రను త్రిష చేస్తుందని కోలీవుడ్ టాక్. 96తో కెరీర్ వేగాన్ని అమాంతం పెంచుకున్న త్రిషకు ఆఫర్ల వెల్లువ బాగానే ఉంది. ఇది ఓకే అయితే 13 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీటైనట్టు అవుతుంది. 2005లో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటాన’లో సిద్ధార్థ్ త్రిషల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రభుదేవా దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ మూవీ వసూళ్లపరంగా రికార్డులు సృష్టించింది. మళ్లీ ఇన్నాళ్లకు సిద్ధార్థ్‌తో త్రిష జోడీ కడుతోందన్న మాట. అందాదున్ రికార్డుల పరంపర ఇంకా ఆగలేదు. చైనాలో ది పియానో ప్లేయర్‌గా రిలీజ్ చేస్తే ఏకంగా 200కోట్లు రాబట్టి ఔరా అనిపించింది. అందుకే సౌత్‌లోనూ ఇది ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందన్న నమ్మకంతో నిర్మాతలున్నారు. వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
.