అడవివీడిన సైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం -సైరా నరసింహారెడ్డి. కథలో భాగంగా కీలకమైన చివరి షెడ్యూల్ కేరళలోని దట్టమైన అడవుల్లో నిర్వహించారు. అక్కడి షెడ్యూల్ పూర్తి కావడంతో చిరుతో కలిసి చరణ్‌దీప్ దిగిన ఫొటోలు బయటికొచ్చాయి. చిరుతో పనిచేస్తూ ప్రయాణించటం అద్భుతమైన అనుభూతి’ అంటూ వ్యాఖ్యానించాడు చరణ్ దీప్. ఆయననుంచి ఎంతో నేర్చుకోవచ్చనీ చెప్పుకొచ్చాడు. ‘నావరకు చిరునే రియల్ హీరో, లెజెండ్’ అంటూ కామెంట్ చేశాడు. సైరాను దర్శకుడు సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సినిమా రూపుదిద్దుకుంటోంది. నరసింహారెడ్డి పాత్రలో చిరు, ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, సుదీప్, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం సమకూర్చారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.