ఆశలన్నీ అర్జున్‌పైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందాల రాక్షసి’గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి మొదటి సినిమాతోనే కావలసినంత గుర్తింపు తెచ్చుకుంది. ‘్భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సూపర్‌హిట్ సినిమాలు తన ఖాతాలో ఉండటంతో ఆఫర్లూ ఫుల్లుగానే వచ్చాయి. కానీ 2016లో ‘శ్రీరస్తుశుభమస్తు’ తర్వాత లావణ్యకు హిట్ అన్నదే లేదు. రెండేళ్లకాలంలో ఆరు తెలుగు సినిమాలు విడుదలైతే అన్నీ బాక్స్ ఆఫీస్‌దగ్గర బోల్తాకొట్టడంతో లావణ్య కెరీర్ ఇప్పుడు నిరాశాజనకంగా ఉంది. లావణ్య చేతిలో ఇప్పుడు ఒకే సినిమా ఉంది. అదే నిఖిల్ హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’. ఈ సినిమా కనుక హిట్టయితే లావణ్యకు తన కెరీర్‌లో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. సినిమా కనుక నిరాశపరిస్తే లావణ్య కెరీర్ చివరిదశకు చేరినట్టేనని సన్నిహితులే అంటున్నారు. అందుకే ఈ సినిమా విజయంపై లావణ్య భారీగా నమ్మకం పెట్టుకుంది. తమిళ సూపర్‌హిట్ ‘కనిదన్’కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా కావడంతో కంటెంట్‌పరంగా స్ట్రాంగ్‌గా ఉంది. లావణ్యకు రిలీఫ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ‘అర్జున్ సురవరం’ ఫలితం లావణ్యకు లిట్మస్ టెస్ట్‌లాంటిదే. సామ్‌సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తమిళ ఒరిజినల్ వర్షన్ దర్శకుడు టీ సంతోష్ ‘అర్జున్ సురవరం’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్‌మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘అర్జున్ సురవరం’ మే1న విడుదల కానుంది.