తమిళ దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు మహేష్‌బాబు. ఇప్పటికే పూర్తికావచ్చిన ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్‌తో ఓ సినిమా చేస్తాడన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమాతోపాటు మరో తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు మహేష్. ‘రాజారాణి’ చిత్రంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన అట్లీకుమార్ ప్రస్తుతం విజయ్‌తో తేరీ (తెలుగులో పోలీసోడు) చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోలీవుడ్‌లో భారీ ప్రకంపనల్ని సృష్టిస్తోంది. అట్లీతో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట మహేష్. ఇప్పటికే అట్లీకుమార్‌తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం వుంది. మరి మహేష్‌కు తెలుగు దర్శకులమీద ఆసక్తి తగ్గిందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.