పాటల్లో 90ఎంఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై పటాన్‌చాన్ బాషా నిర్మిస్తున్న చిత్రం 90 ఎంఎల్. ఇది చాలా తక్కువ టాగ్‌లైన్. అబ్బాయిలే ఎందుకు ఎంజాయ్ చెయ్యాలి. అమ్మాయిలెందుకు చెయ్యకూడదు. వారికీ కోరికలుంటాయి అన్న కానె్సప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో ఒవియాహెలెన్, అన్‌సన్‌పాల్, మాసూన్ శంకర్ నటిస్తున్నారు. అనితా ఉదీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో శింబు ప్రత్యేక పాత్రలో నటించాడు. ఏప్రిల్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాసూన్ శంకర్ మాట్లాడుతూ ఆడ పిల్లలకూ అన్ని కోరికలూ ఉంటాయి. ఎంజాయ్ చెయ్యాలన్నదే చిత్రంలో చూపించారన్నారు. ఆర్టిస్ట్‌లకన్నా వారి పాత్రలే ఎక్కువ కనిపిస్తాయన్నారు. బొమ్ములక్ష్మీ మాట్లాడుతూ తెలుగులో తనను పరిచయం చేసిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. తమిళంలో మాదిరే తెలుగులోనూ హిట్టవ్వాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. శ్రీ గోపిక మాట్లాడుతూ సినిమాలో అంతా కొత్తవాళ్లే, ఆదరించండి అని కోరారు. చాంద్‌బాషా మాట్లాడుతూ ఇది వల్గర్ చిత్రం కాదని, మెసేజ్ ఓరియంటెడ్ అన్నారు. శింబు మ్యూజిక్ ఇవ్వడంతోపాటు ప్రత్యేక పాత్రలో నటించారన్నారు.