ముగిసిన సెవెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుగురు అమ్మాయిలు. ఆరు ప్రేమకథలు. అన్నింటికీ ఒక్కడే కుర్రాడు. ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతను మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతనే్న ఎందుకు కోరుకుంటోంది? ఈ విషయాలు ‘7’ సినిమా చూసి తెలుసుకోమంటున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. ఆయన కథ అందించి నిర్మాతగా చిత్రాన్ని తెరకెక్కించారు. హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ -7. రెజీనా, నందితాశే్వత, అనీష్ ఆంబ్రోస్, త్రిధాచౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. రహమాన్, సుంకరలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో ఉంది. రమేష్‌వర్మ మాట్లాడుతూ ‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా. ఊహకందని మలుపులతో స్క్రీన్‌ప్లే సాగుతుంది. ప్రతి ట్విస్ట్ ఓ షాకింగ్. ఆ షాక్ వెనుక ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఈనెల చివరి వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాట విడుదలచేస్తున్నాం. మేలో సినిమా విడుదల చేస్తాం’ అన్నారు.