వ్యూహం.. మార్చేశాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, సుధీర్‌బాబుతో దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఓ ప్రాజెక్టును ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘వ్యూహం’ టైటిల్ ఖరారు చేసుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. అదే టైటిలే నిర్ణయమైపోయినట్టు కూడా హాడావుడి జరిగింది. అయితే సినిమా టైటిల్ ‘వ్యూహం’ కాదన్న సంగతి చిత్రవర్గాల ద్వారా తెలుస్తోంది. అచ్చ తెలుగు టైటిల్స్‌పై ఆసక్తిచూపే ఇంద్రగంటి ఈ చిత్రానికీ అలాంటి టైటిలే పెట్టొచ్చని అంటున్నారు. గతంలో సమ్మోహనం, అష్టాచెమ్మా, అంతకుముందు ఆ తరువాత లాంటి టైటిల్‌తో సినిమాలు తీసి, టైటిల్స్‌తోనే ఇంద్రగంటి ఆసక్తిని రేకెత్తించటం తెలిసిందే. ఇదిలావుంటే, కొత్త ప్రాజెక్టులో ఆదితిరావ్ హైదరి, నివేద థామస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. థ్రిల్లర్ కానె్సప్ట్‌తో సాగే చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. నాని, సుధీర్‌బాబు మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు అద్భుతంగా రాసుకున్నాడన్న కథనాలు వినిపిస్తున్నాయి.