షో టైమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో -పెద్ద సినిమాల విడుదల డేట్లు కాస్త అటూ ఇటూ అయ్యాయ. అలా వచ్చిన గ్యాప్‌లో థియేటర్లకు వచ్చేందుకు చిన్న సినిమాలు రెడీ అయపోయాయ. స్లాట్ దొరకడంతో వచ్చే శుక్రవారం హాలీవుడ్ సినిమా అవెంజర్స్‌తోపాటు డేంజర్ లవ్, దిక్సూచి, ఎంబిఎం (మేరా భారత్ మహాన్) విడుదలవుతున్నాయ.

డేంజర్ లవ్:
ప్రేమ ప్రమాదంలో పడినపుడు దాన్ని కాపాడుకునేందుకు రెండు జంటలు ముందుకెలావెళ్లాయన్న ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమా -డేంజర్ లవ్. ఖయ్యూం, మధులగ్నదాస్, గౌరవ్, అథియా జంటలుగా శేఖర్‌చంద్ర దర్శకత్వంలో అవధూత గోపాలరావు నిర్మించిన సినిమా. విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ భిన్నమైన టైటిల్, కొత్త కథాంశంతో వస్తున్న ఇలాంటి చిత్రం విజయవంతం కావాలన్నారు. సీనియర్ నటి కవిత మాట్లాడుతూ నేటి కాలంలో ప్రేమ ప్రమాదంలో పడటం చూస్తున్నదేనని, అలాంటి కథాంశాన్ని ఎత్తుకోవడంలోనే చిత్ర బృందం విజయం సాధించిందన్నారు. నిర్మాత అవధూత గోపాలరావు మాట్లాడుతూ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమా నిర్మించామని, విలన్ సన్నివేశాలు గగుర్పాటు కలిగిస్తాయన్నారు. దర్శకుడు శేఖర్‌చంద్ర మాట్లాడుతూ ఊహించని మలుపులు, ఆసక్తికర కథాంశంతో సాగే చిత్రమన్నారు. ఎన్నో ప్రేమకథలకు ఇది భిన్నమని, సస్పెన్స్, హారర్‌తోపాటు మంచి వినోదం ఉంటుందన్నారు. హీరో గౌరవ్, అథియా మాట్లాడుతూ తమకు తొలి సినిమా అయినా, దర్శక నిర్మాతల సహకారంతో కంఫర్ట్ ఫీలయ్యామన్నారు.
దిక్సూచి:
దిలీప్‌కుమార్ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా -దిక్సూచి. డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమాను శైలజ సముద్రాల, నరసింహారాజు రాచూరి నిర్మించారు. బేబి సనికసాయి శ్రీ రాచూరి సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సెమీ పీరియాడిక్ స్టోరీ ఇదని, తనతోపాటు చత్రపతి శేఖర్, సమ్మెగాంధీ, చాందిని, సుమర్ తదితరులు నటించారన్నారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు.
ఎంబిఎం (మేరా భారత్ మహాన్):
అఖిల్ కార్తిక్, ప్రియాంక శర్మ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం -ఎంబిఎం (మేరా భారత్ మహాన్). వైద్యవృత్తిలోవున్న శ్రీ్ధర్‌రాజు, తాళ్ల రవి, టి పల్లవిరెడ్డి తొలిసారి సంయుక్తంగా తెరకెక్కించారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిత్ర నిర్మాత, కథ రచయిత, నటుడు, నిర్మాత శ్రీ్ధర్‌రాజు ఎర్ర మాట్లాడుతూ సమకాలీన అంశాలకు కమర్షియల్ హంగులు జోడించి సందేశాత్మక సినిమా నిర్మించామన్నారు. మరో నిర్మాత తాళ్ల రవి మాట్లాడుతూ దేశం బాగుపడాలంటే యువత సంకల్పించాలి. సమాజంలోని సమస్యలను అరికట్టే బాధ్యత వారిదే కాబట్టి యువతను చైతన్యపర్చే చిత్రాన్ని నిర్మించామన్నారు. డాక్టర్ పల్లవిరెడ్డి మాట్లాడుతూ మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరారు. దర్శకుడు భరత్ మాట్లాడుతూ సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుందనే సామాజిక స్పృహతోపాటు కమర్షియల్ అంశాలతో ఆడియన్స్ మెచ్చేలా సినిమా తెరకెక్కించామన్నారు. కార్యక్రమంలో హీరో భరత్ తదితరులు మాట్లాడారు.
అవెంజర్స్.. -ఎండ్ గేమ్:
ప్రపంచ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అవెంజర్స్ -ఎండ్ గేమ్ 26న విడుదలవుతోంది. ట్రైలర్‌తోనే టాప్‌లేసిన చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 500 థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేశారు. ఓ హాలీవుడ్ అనువాదాన్ని ఇంత భారీఎత్తున విడుదల చేయడం ఇదే తొలిసారి. రాబర్ట్ డౌనీ జూనియర్ నటించిన ఈ మార్వెల్ స్టూడియోస్ సినిమాలో క్రిస్ ఇవాన్స్, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్‌వర్త్, స్కార్లెట్ జాన్సన్ నటిస్తున్నారు. ‘అవెంజర్స్’ సిరీస్‌నుంచి వస్తున్న చివరి సూపర్ హీరో సినిమా అని సమాచారం. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’కు రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించారు. థానోస్ శక్తితో కనిపించకుండా పోయిన అవెంజర్స్ మళ్లీ ఎలావచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే కథ.