వేశ్య పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో స్పైసీ పాత్రలతో యూత్‌ని అట్రాక్ట్ చేసిన శ్రద్ధాదాస్, ఇటీవలే ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది. ఓ వేశ్య మనోభావాలు, కల్మషంలేని హృదయం కళాత్మక దృష్టితో తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ -ప్యూర్ సోల్. బాలీవుడ్‌లో ఈ తరహా లఘుచిత్రాలను చాలామంది స్టార్లే చేసి చూపించారు. అలాంటి బోల్డ్ పాత్రలో శ్రద్ధ కనిపించబోతుంది. కథ విషయానికొస్తే -వరుణ్ ప్రేమలో విఫలమైన మంచి పెయింటర్. తన ప్యారిస్ ఎగ్జిబిషన్‌లో 100వ పెయింటింగ్ కోసం ఒక వేశ్య(శే్వత)ని ఎంచుకుంటాడు. తను ప్రేమించిన అమ్మాయిని మొదటి పెయింటింగ్‌గా మొదలుపెట్టిన వరుణ్, తన వందో పెయింటింగ్‌కి శే్వతని ఎంచుకుంటాడు. అయితే పెయింటింగ్ చేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో శే్వతలో ఒక ప్యూర్ సోల్‌ని చూస్తాడు వరుణ్. అదే సమయంలో సమాజంలో నిజాయితీని వరుణ్‌లో చూస్తుంది శే్వత. తను ప్రేమించిన అమ్మాయిలో అబద్ధాన్ని చూసిన వరుణ్‌కి, శే్వతలో ప్యూరిటీ ఆఫ్ వుమెన్ కనిపించింది. వీరిద్దరిమధ్య జరిగిన సంభాషణలో వరుణ్ పెయింటింగ్ పూర్తి చేస్తాడు. అసలు ఆ పెయింటింగ్ ఏమిటి? అనేది దర్శకుడు చిలుకూరి ఆకాష్‌రెడ్డి చక్కగా తెరకెక్కించాడు. ముఖ్యంగా వరుణ్, శే్వతల మధ్య సంభాషణే ‘ప్యూర్ సోల్’కి మూలం.