గిరీశంలాంటి పాత్ర కనుకే నటిస్తున్నా.. గజల్ శ్రీనివాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజల్ శ్రీనివాస్, మాధవీలత జంటగా కృష్ణవాస దర్శకత్వంలో లతాశ్రీ చిత్రాలయం బ్యానర్‌పై పి.ఎం.రవిరాజ్‌రెడ్డి నిర్మిస్తున్న ‘అనుష్ఠానం’ చిత్రంలోని పాటలు బుధవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత లగడపాటి శ్రీ్ధర్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గాయకుడిగా గజల్ శ్రీనివాస్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందేనని, నటుడిగాకూడా అంతే మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతుంటాయని, అటువంటి గొడవల తలెత్తడం, పరిష్కరించడం ఎలాగో వివరిస్తూ సినిమాలను తీస్తే వారి దాంపత్యం బాగుంటుందని, ఈ తరహా చిత్రాల్నే ఆదరించాలని అన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, నిజానికి ఈ సినిమాలో హీరోగా చేయాలనుకోలేదని, కన్యాశుల్కంలో గిరీశం పాత్ర తరహాలో ఉండడంతో చేయాల్సి వచ్చిందని, కథ ఈ చిత్రానికి ఆత్మలాంటిదని, మాధవీలత అద్భుతంగా నటించిందని అన్నారు. తమిళ, హిందీ, మలయాళ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేస్తామని, తెలుగులో జూన్‌లో విడుదల చేస్తామన్నారు. నిర్మాత రవిరాజ్ రెడ్డి మాట్లాడుతూ, చలంగారి సాహిత్యం స్ఫూర్తితో కృష్ణవాస చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశానని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమాను చేయడానికి సహకారం అందించిన నిర్మాతకు ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్: కె.ఆంజనేయులు, సంగీతం:చంద్రలేఖ, సహ నిర్మాత:వల్లూరి జయప్రకాష్, నిర్మాత:రవిరాజ్‌రెడ్డి, దర్శకత్వం:కృష్ణవాస.