రీమేక్.. నాతో కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెర్సీతో హీరో అయిపోయాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఓ మైలురాయి లాంటి చిత్రాన్ని అందించి డిఫరెంట్ టేస్ట్‌వున్న దర్శకుడిగా పేరుపడ్డాడు గౌతమ్. అనూహ్యమైన సక్సెస్‌ను అకస్మాత్తుగా ఎంజాయ్ చేయడం కష్టమైందని చెప్పుకున్న గౌతమ్ -బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని బాలీవుడ్‌లో తెరకెక్కించడం మాత్రం నావల్ల కాదని చెప్పేశాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ జెర్సీ మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఆడియనే్స కాదు, క్రిటిక్సూ దర్శకుడి పనితనానికి ప్రశంసలివ్వడమే కాదు, ఫిదా అయిపోయారు. ఓ ఇంటర్వ్యూలో జెర్సీ విజయాన్ని నిజాయితీగా ఎంజాయ్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చిన గౌతమ్ తిన్ననూరి, హిందీ రీమేక్‌పై మాత్రం స్పష్టమైన సమాధానానే్న ఇచ్చేశాడు. ‘రీమేక్ గురించి ఇప్పుడే ఏంచెప్పలేం. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలే లేవు’ అంటూ చెప్పేశాడు. ఒకవేళ రీమేక్ చేయాల్సి వస్తే మీరే దర్శకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు కూడా తడుముకోకుండా -‘నావల్ల కాదండి’ అంటూ ముక్తసరి సమాధానం ఇచ్చేశాడు. ఇటీవలి కాలంలో ఓమాదిరి విజయం అందుకున్న చిత్రాలు తక్షణం బాలీవుడ్ రీమేక్‌కు వెళ్లిపోతున్న అంశాన్ని చూస్తూనే ఉన్నాం.