దళపతితో కింగ్‌ఖాన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న ‘తలపతి 63’ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్ చెన్నైలో జరగనుంది. 50 రోజులపాటు జరుగనున్న షెడ్యూల్‌కోసం ఈవీపి స్టూడియోస్ భారీ ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ను నిర్మిస్తున్నారు. ఇక చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్‌ను షేక్‌చేస్తుంది. ఇటీవల షారుఖ్ చెన్నైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను అట్లీతో కలిసి చూశాడు ఆ తరువాత ఆయన అట్లీ ఆఫీస్‌కు రావడంతో వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని టాక్ వినిపించింది. ఇక తాజాగా తలపతి 63 కోసమే అట్లీ, షారుఖ్‌ను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే షారుఖ్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అని తెలియాలంటే మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఫుట్‌బాల్ కోచ్‌గా నటిస్తున్నాడు. లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా భారీ బడ్జెట్‌తో ఏజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.