బయోపిక్‌లో తారకరత్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి తారకరత్న దేవినేని నెహ్రూగా నటిస్తున్నారు. బెజవాడ సింహం అన్న ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకుడు. బుధవారం చిత్రానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్‌కొట్టగా, నటి జమున కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ గతంలో ఒకసారి కథ గురించి నెహ్రూని కలిశాను. ఎందుకు అనవసరంగా కాంట్రవర్సీ అన్నారు. తరువాత కథ విని ఓకె అన్నారు. ఆయన తుది శ్వాస విడిచినపుడు, తారక్‌కి కథ చెబితే కొన్ని మార్పులు సూచించారు. మే10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దసరాకి విడుదల చేద్దామనుకుంటున్నా. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేస్తాం అన్నారు. హీరో తారక్ మాట్లాడుతూ- మా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులైన వ్యక్తి. ఆయన పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. శివనాగు లాంటి దర్శకుడు, రాములాంటి మంచి ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. మా అమ్మ జమున చేతులమీదుగా ఈ సినిమా రావడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.