పాటల పెన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.వి.ప్రకాష్, శ్రీ దివ్య జంటగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై మణినాగరాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందిస్తున్న చిత్రం పెన్సిల్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాలోని పాటలను ఆన్‌లైన్‌లో విడుదల చేసారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటలు విడుదల చేసిన సందర్భంగా నిర్మాత హరి మాట్లాడుతూ, పాఠశాల, కాలేజ్ నేపథ్యంలో జరిగిన కథ ఇదనీ, యూత్‌ఫుల్‌గా, మెసేజ్ ఓరియెంటెడ్‌గా సాగుతుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ వేసవిలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. కథానాయకి శ్రీ దివ్య మాట్లాడుతూ, జి.వి.ప్రకాష్ మంచి బాణీలు అందించారనీ, ఉన్న నాలుగు పాటలు అందరికీ నచ్చుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరికీ చిన్ననాటి పెన్సిల్ గీతలు రాసిన ముచ్చట్లు గుర్తుకు వస్తాయనీ ఆమె అన్నారు. పాటలకు మంచి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. షరీఖ్ హాసన్, వి.టి.వి.గణేష్, ఊర్వశి, టి.పి.గజేంద్రన్, అభిషేక్ శంకర్, ప్రియామోష్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: గోపి అమర్‌నాథ్, ఎడిటింగ్: ఆంటోని, పాటలు: శ్రీమణి, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: మణిరాజ్.