తెరపైకి జాక్వెలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస హిట్లు అందుకుంటున్న రాజవౌళి అంటేనే ఓ స్పెషల్. అలాంటి జక్కన్న బాహుబలి తరువాత మరింత హైట్స్‌కి చేరాడు. దీంతో ఆయన తాజా ప్రాజెక్టు ‘ట్రిపుల్ ఆర్’పై ప్రతి చిన్న విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా ప్రాజెక్టుకి సంబంధించి రోజుకో ఆసక్తికరమైన విషయమూ బయటికొస్తుంది. జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్ ప్రకటించి పల్స్ రేటు పెంచేసిన రాజవౌళి, వాళ్లద్దరితో ఎవరు జోడీ కట్టనున్నారన్న విషయంపైనా హీట్ పెంచాడు. చరణ్‌కు జోడీగా ఆలియాభట్‌ను కన్ఫర్మ్ చేసిన జక్కన్న, ఎన్టీఆర్‌కు జోడీ విషయంలో అనేక పేర్లు ఇంకా పరిశీలిస్తూనే ఉన్నాడు. ముందుగా బ్రిటీష్ యాక్ట్రెస్ డైసీని ప్రకటించినప్పటికీ, టెక్నికల్ ఇబ్బందులతో ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. తరువాత శ్రద్ధాకఫూర్ పేరు పరిశీలనకు వచ్చింది. ఆమె కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవటంతో -పరిణీతి చోప్రాని ఫిక్సయినట్టు కథనాలు వచ్చాయి. దీనిపైనా స్పష్టత రాకముందే -జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరు తెరపైకొచ్చింది. అయితే జాక్వెలిన్ కన్ఫర్మ్ అయితే ఎన్టీఆర్‌కు జోడీగా కనిపిస్తుందా? లేక ఏదైనా ముఖ్య పాత్రలో కనిపించనుందా? అన్నది తెలియాల్సి ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా నిర్మితమవుతున్న నేపథ్యంలో -బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్‌గణ్, తమిళం నుంచి సముద్ర ఖనితో దర్శకుడు జక్కన్న ముఖ్యపాత్రలు చేయిస్తుండటం తెలిసిందే.