1న శ్రామిక మహర్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కొత్త ప్రాజెక్టు మహర్షి ప్రీ రిలీజ్ వేడుకకు అటు వేదిక, ఇటు ముహూర్తం.. రెండూ ఖరారయ్యాయి. మే1న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్టు ‘శ్రామిక మహేష్’ పోస్టర్‌తో ప్రకటించారు. ప్యాంటు షర్ట్‌తో నెత్తికి తలపాగ చట్టుకుని చేనులో నాట్లేస్తున్న శ్రామిక మహర్షి పోస్టర్‌తో చిత్రబృందం ఈ వివరాలు ప్రకటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు తాజా ప్రాజెక్టు మహర్షి రూపుదిద్దుకోవడం తెలిసిందే. పూజా హెగ్దె కథానాయికగా నటించిన చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. మహేష్‌కు సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్టు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. కాలేజీ స్టూడెంట్‌గా, విదేశాల్లో ఒక సంస్థకి సీఈవోగా, రైతుగా.. ఈ సినిమాలో మహేష్‌బాబు డిఫరెంట్ లుక్స్‌తో కనిపించనున్నాడన్నది ఆసక్తికరం. ఇప్పటి వరకూ విడుదలైన లుక్స్, పోస్టర్లను బట్టిచూస్తే -ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే ఉద్యోగాలు సంపాదించిన చాలామంది కుర్రాళ్లు -తరువాత పుట్టినగడ్డపై మమకారంతో వెనక్కి వచ్చి మళ్లీ సాగుకు ఉపక్రమించిన రియల్ స్టోరీస్ చాలానే విన్నాం, చూశాం. ఆమధ్య ఇదో ఫ్యాషన్‌గానూ మారింది. అలాంటి పాయింట్ బేస్‌తోనే వంశీ పైడిపల్లి ‘మహర్షి’ కథను అల్లుకున్నాడా? అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన సినిమాలో అల్లరి నరేశ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.