మొదలైంది.. హ్యాట్రిక్ జర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్- అల్లు అర్జున్.. అనుకున్న టైమ్‌కి సెట్స్‌మీదకు వచ్చేశారు. ఇద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న హ్యాట్రిక్ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే బుధవారంనుంచి రెగ్యులర్ షూట్ మొదలుపెట్టారు. బేగంపేట పోలీస్ లైన్స్‌లో మొదలైన తొలి షెడ్యూల్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తారట. గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బన్నీతో రెండోసారి పూజా హెగ్దె జోడీ కడుతోంది. ఇంతకుముందు హరీశ్ శంకర్ దర్శకత్వంలో బన్నీ చేసిన ‘దువ్వాడ జగన్నాథం’లో తొలిసారి జోడీకట్టింది. ఆ సినిమాలో అందాల ఆరబోతలో కాస్తంత దూకుడుగానే వెళ్లిన పూజహెగ్దె -ఈ సినిమాలో ఎలాంటి గ్లామర్ చూపించనుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. ఇంకా టైటిల్ ఫిక్స్‌గాని ప్రస్తుత ప్రాజెక్టుకు ఎస్‌ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తుంటే, పీఎస్ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘నా పేరు సూర్య..’ చిత్రంతో అనూహ్య ఫలితాన్ని చవిచూసిన బన్నీ, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న ప్రాజెక్టు ఇది. బన్నీకి కచ్చితంగా హిట్టుపడాల్సిన తరుణంలో -మరోసారి త్రివిక్రమ్‌తో కాంబినేషన్‌కు వెళ్తున్నాడు. గతంలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లాంటి భారీ విజయాలు అందించిన త్రివిక్రమ్‌తో బన్నీ చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. బన్నీ నమ్మకాన్ని త్రివిక్రమ్ ఏ జోనర్‌తో నిలబెడతాడన్న ఆసక్తి లేకపోలేదు. ఫ్యామిలీ డ్రామాను చెబుతాడా? త్రివిక్రమ్‌కు బాగా అలవాటైన ఇతిహాస, పురాణాల్లోని పాయింట్ తీసుకుని సోషల్ నేరేషన్‌లో కొత్త కథ చూపిస్తాడా? అన్నది అంచనాలకు అందనిదే. టబు, బొమన్ ఇరాని, జయరామ్, సుశాంత్, నవదీప్‌లు ప్రాజెక్టులో కీలక పాత్రలు పోషించనున్నారు.