అమల.. కాస్త కొత్తగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని అమల చాలారోజుల తరువాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెబ్ సిరీస్ హై ప్రీస్ట్స్‌లో అమల ముఖ్య పాత్ర పోషిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన వెబ్ సిరీస్ ఏప్రిల్ 25నుంచి జీ 5 ఆప్‌లో ఆన్‌లైన్ కానుంది. టారో రీడింగ్ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్‌కు పుష్ప దర్శకత్వం వహించారు. వెబ్ సిరీస్‌లో అమలతోపాటు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్, సునయిన, బిగ్‌బాస్ 2 ఫేమ్ నందిత తదితరులు నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ ఈ వెబ్ సిరీస్‌కి వర్క్ చేశారు. గతంలో ఎన్నో విజయవంతమైన వెబ్ సిరీస్‌లను అందించిన నేపథ్యంలో మరోసారి మరింతగా ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నంలో అక్కినేని అమలతో ఈ హై ప్రీస్ట్స్ సిరీస్ నిర్మించినట్టు జీ 5 ఆప్ బృందం వెల్లడించింది. అక్కినేని అమల మాట్లాడుతూ చాలా రోజుల తరువాత డైరెక్టర్ పుష్ప చెప్పిన లైన్ నచ్చడంతో వెబ్ సిరీస్‌లో నటించేందుకు అంగీకరించానని అన్నారు. అక్కినేని ఫ్యాన్స్‌తోపాటు మిగిలిన అభిమానులనూ వెబ్ సిరీస్ తప్పక ఆకట్టుకుంటుందని అమల అన్నారు.